జ్వరం, దగ్గు, జలుబు ఇవి చూడ్డానికి చిన్న సమస్యలే అయినా చాలా ఇబ్బంది పెడతాయి. ఒక్కసారి ఈ సమస్యలు వచ్చాయంటే అంత త్వరగా తగ్గవు. ముక్కుదిబ్బడ, గొంతునొప్పి, నీరసం ఇలా చాలానే ఇబ్బందిగా ఉంటుంది. వీటిని తగ్గించుకునేందుకు చాలా మంది మెడిసిన్ వాడుతుంటారు. అలా వాడే ముందు ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలను వాడండి. దీంతో జలుబు, దగ్గు చాలా త్వరగా తగ్గుతుంది. పైగా వీటిని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే, వాడే ముందు వాటి కారణంగా మీకు అలర్జీ వంటివి రావని చెక్ చేసుకోండి. మరి, జ్వరం, జలుబుని తగ్గించే ఇంటి చిట్కాల గురించి తెలుసుకోండి.
హాట్ సూప్స్
సూప్స్ అనేవి జలుబు, ఇతర సమస్యలకి చాలా మంచివి. ఇందులో విటమిన్స్, కూరగాయల్ని యాడ్ చేస్తాం. కాబట్టి, వాటి నుంచి వచ్చే పోషకాలు అదనం. ఇవి రాత్రుళ్లు డిన్నర్ బదులు తీసుకుంటేచాలా మంది. దీని వల్ల ఆకలి తీరడమే కాకుండా గొంతునొప్పి కూడా తగ్గుతుంది. దీంతో పాటు హైడ్రేటెడ్‌గా ఉండాలి. సూప్‌లో చాలా గుణాలు ఉంటాయి. ఇది మనకి పోషణని అందించడమే కాకుండా ఈజీగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మనం చేసే సూప్‌లో ఎక్కువగా కూరగాయల్ని యాడ్ చేయండి. కాబట్టి, అందులోని ఫైటో న్యూట్రియెంట్స్ ఇమ్యూనిటీని బలంగా చేస్తాయి. దీంతో బాడీలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. దీంతో కోల్డ్ కూడా తగ్గుతుంది. చికెన్ సూప్ తీసుకుంటే జ్వరం త్వరగా తగ్గుతుంది. మనం హాట్ సూప్ తీసుకోవడం వల్ల కఫం పేరుకుపోవడాన్ని తగ్గించుకోవచ్చు. ఇందులో కొద్దిగా మిరియాల పొడి చల్లితే సైనస్ కూడా క్లియర్ అవుతుంది.
నల్లమిరియాల కషాయం
న్లలమిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్స్‌ని తగ్గిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు తగ్గుతాయి. దీనికోసం నల్లమిరియాలని పొడిలా ఉప్పుతో కలిపి చాయ్‌తో కలిపి తీసుకోండి. దీని వల్ల కఫం, మ్యూకస్ తగ్గడమే కాకుండా జలుబు, దగ్గు దూరమవుతాయి. వీటితో పాటు నల్ల మిరియాలని రోజూ వంటల్లో వాడండి.
వెల్లుల్లి
వెల్లుల్లిలో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇందులో అల్లీసిన్ ఉంటుంది. ఇది మనకి ఉండే జలుబుతో ఫైట్ చేస్తుంది. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జలుబు, జ్వరాన్ని తగ్గిస్తాయి. దీనికోసం మనం పచ్చి వెల్లుల్లినే తినొచ్చు. మనం రెగ్యులర్‌గా వెల్లుల్లిని తింటే జలుబు, జ్వరాలు తగ్గుతాయి.
పసుపు పాలు
పసుపుని గోరువెచ్చని పాలలో కలిపి తీసుకోవడం కూడా మంచిది. దీని వల్ల జలుబు, దగ్గు తగ్గుతాయి. పసుపులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. దీని కారణంగా కారణంగా పొడి దగ్గు తగ్గుతుంది. రాత్రుళ్లు పడుకునే ముందు పాలలో పసుపు కలిపి తాగితే త్వరగా రికవరీ అవుతారు. అయితే, పసుపు మరీ ఎక్కువగా కలపకూడదు. దీంతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది.
![]() |
![]() |