నెల్లూరులో కాల్పులు కలకలం రేపాయి.. వ్యాపారం కోసం నగరానికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయిన ఓ కుటుంబంలో తండ్రీకొడుకుల మధ్య పంచాయితీ కాల్పులకు కారణమైంది. నగరంలోని ఆచారి వీధిలో నివాసం ఉంటున్న రాజ్‌మల్‌జైన్‌కు సొంతంగా వ్యాపారాలు ఉన్నాయి. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తండ్రి రాజ్‌మల్, తల్లితో పెద్ద కుమారుడు దిలీప్‌కుమార్‌జైన్, మూడో కుమారుడు మనోజ్‌కుమార్‌జైన్ కలిసి ఉంటున్నారు. రెండో కుమారుడు హితేష్‌కుమార్‌జైన్ మాత్రం వ్యసనాలకు బానిసగా మారాడు. హితేష్‌కు వివాహమైన తర్వాత తల్లిదండ్రుల దగ్గర ఉండటంలేదు.. నగరంలోని శిఖరం వారి వీధిలో వేరు కాపురం పెట్టాడు.
హితేష్ తన తండ్రి రాజ్‌మల్ నుంచి ఆస్తిలో ఇప్పటికే రూ.40 లక్షలు తన వాటాగా తీసుకున్నాడు. ఆ డబ్బులతో బెంగళూరులో వ్యాపారం చేసి నష్టపోయాడు హితేష్. ఐదేళ్లుగా సుబేదారుపేటలో దుర్గ గ్లాస్, ప్లైవుడ్ షాపు నిర్వహిస్తున్నా లాభా రాలేదు.. నష్టాలు మిగిలాయి. మళ్లీ ఆస్తిలో వాటా కావాలంటూ తల్లిదండ్రులు, సోదరులపై ఒత్తిడి తెస్తూ వేధిస్తున్నాడు. హితేష్ తండ్రి దగ్గరకు వచ్చి గొడవపడుతున్నాడు.. ఈ నెల 11న వచ్చి ఆస్తి పంపకాలు చేయకపోతే తుపాకీతో కాల్చుకుకుని చనిపోతానని బెదిరింపులకు దిగాడు. అయితే తుపాకీ పేలకపవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొంతమంది పెద్దలు వెంటనే జోక్యం చేసుకుని హితేష్‌కు నచ్చజెప్పారు.
హితేష్ మళ్లీ శనివారం అర్ధరాత్రి ఐదుగురితో కలిసి తండ్రి ఉంటున్న ఇంటి తలుపులు తెరవాలని పెద్ద గొడవ చేశాడు. తలుపులు తీయాలంటూ బెదిరింపులకు దిగాడు.. ఎవరూ ఇంట్లో నుంచి స్పందించకపోవడంతో వెంట తెచ్చిన గన్ తీసి ఒక రౌండ్ ఇంటి తలుపులపై కాల్చాడు.. ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పిపోయింది. ఆ తర్వాత బాధితులు నెల్లూరు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్పీ చిన్నబజారు పోలీసులను అప్రమత్తం చేయగా.. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడితో పాటు అతని వెంట వచ్చిన మరో ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
![]() |
![]() |