డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటుంది. ప్రత్యేకంగా నార్కొటిక్ టీమ్‌లు ఏర్పాటు చేసి వరుసగా దాడులు చేస్తోంది. అయినా గంజాయి చాప కింద నీరులా రాష్ట్రంలో ప్రవహిస్తోంది. గుట్టు చప్పుకుండా కాకుండా కొందరు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. కాలేజీ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే లక్ష్యంగా గంజాయిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులోనూ యవతే ఎక్కువగా ఈ చీకటి బిజినెస్ వైపు మెుగ్గుచూపుతున్నారు. ఏపీ నుంచి ట్రైన్లు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో గంజాయిని తెప్పించి ఆన్‌లైన్ వేదికగా అవసరమైన వారికి గంజాయిని విక్రయిస్తున్నారు.
తాజాగా.. ఇద్దరు యువకులు నడిరోడ్డుపై గంజాయితో పట్టుపడ్డారు. పట్ట పగలే గంజాయి విక్రయిస్తూ ఎస్‌వోటీ పోలీసులకు చిక్కారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ KPHB పోలీస్ స్టేషన్ పరిధిలోని వన్ సిటీ వద్ద ఇద్దరు యువకులు గంజాయి అమ్ముతున్నట్లు ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. గంజాయితో ఉన్న ఇద్దరు యువకులను పట్టుకున్నారు. ఏపీలోని విశాఖ నుంచి గంజాయిని అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితులు జగన్మోహన్, అరుణ్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి వారి వద్ద నుంచి 1.3 కేజీల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండు మొబైల్ ఫోన్లు, ఒక బైక్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు.
తాము ఏపీ నుంచి అక్రమ మార్గంలో గంజాయిని తెప్పించి నగరంలోని యువతకు ఆన్‌లైన్, ఇన్‌స్టా వేదికలుగా అమ్ముతున్నట్లు వెల్లడించారు. చాలా కాలంగా ఈ వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కువగా కాలేజీ యువత, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు గంజాయిని విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, యువత గంజాయికి బానిసలుగా మారటం కలవరపాటుకు గురి చేస్తోంది. గంజాయి సంస్కృతి పట్టణాల్లోనే కాకుండా పల్లెలకు కూడా విస్తరించింది. చాలా గ్రామాల్లో స్కూలుకు వెళ్లే పిల్లలు కూడా గంజాయికి బానిసలుగా మారుతున్నారు. గంజాయి మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతిపై అత్యాచారానికి పాల్పడిన దండుగుడిని పోలీసులు గుర్తించగా.. అతడు గంజాయికి బానిసగా మారినట్లు తెలిసింది.
![]() |
![]() |