ప్రంపచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తనకు చాలా మంచి మిత్రుడు అయ్యాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. గతంలో తామిద్దరి మధ్య అంతగా పరిచయం లేకపోయినప్పటికీ.. ఎన్నికల సమయంలో తనకు ఎంతగానే సాయం చేశాడని గుర్తు చేశారు. దాని వల్లే తాను ఎన్నికల్లో గెలిచానంటూనే.. అమెరికా కోసం మస్క్ పడుతున్న కష్టాల గురించి వివరించారు. మస్క్ తన ప్రియమిత్రుడు మాత్రమే కాకుండా గొప్ప దేశభక్తుడు అని ట్రంప్ వెల్లడించారు. ప్రస్తుతం యూఎస్ అధ్యక్షుడు చేసిన ఈ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను డోజ్ అధినేతగా నియమించారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి.. అనేక మందిని ఉద్యోగాల్లోంచి తీసేస్తూ షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది ఏమాత్రం మింగుడు పడని అమెరికా ప్రజలు.. మస్క్‌పై విపరీతమైన విమర్శలు చేస్తున్నారు. వీలు దొరికినప్పుడల్లా ఆగ్రహం చేస్తూనే వస్తున్నారు. అయితే ఈమధ్య కొందరు ఆయన కార్లపై దాడులు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా టెస్లా కంపెనీకి సంబంధిచిన కార్లపై దాడులు ఇటీవల కాలంలో ఎక్కువ అయ్యాయి.
దీంతో ఇటీవలే ట్రంప్ టెస్లా కార్లపై ఎవరైనా దాడులకు పాల్పడితే 20 ఏళ్లు జైలుశిక్ష విధిస్తామని తెలిపారు. అంతేకాకుండా ఈ దాడులను ప్రోత్సహిస్తున్న వారికి కూడా శిక్షలు తప్పవని హెచ్చరించారు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం మరోసారి వెలుగులోకి రాగా.. ఇప్పుడు ట్రంప్ చేసిన కామెంట్ల చూస్తుంటే వీరెంత క్లోజ్ ఫ్రెండ్సో అర్థం అవుతుంది. ముఖ్యంగా మార్చి 24వ తేదీన తన రెండో క్యాబినెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్లు చేశారు.
నేను మీ అందరికీ ఎలాన్ మస్క్ గురించి చెప్పాలనుకుంటున్నానని మొదలు పెట్టి.. అతడు నాకు మంచి స్నేహితుడు అయ్యాడని ట్రంప్ వివరించారు. ఎన్నికల్లో మద్దతిచ్చి నా గెలుపుకు కారణం అయ్యాడని చెప్పుకొచ్చారు. అప్పుడే నాకు అతడి గురించి పూర్తిగా తెలిసిందని.. గంతలో అతడి పేరు తప్ప అంతగా ఏమీ తెలియదని వెల్లడించారు. తామెంత స్నేహంగా ఉన్నా ఎప్పుడూ మస్క్ తనను ఓ పని చేసి పెట్టమని అడిగిందని లేదని.. అడిగే అవకాశం ఉన్నా అతడు అలా చేయకపోవడం మస్క్ నిజాతీయితిని బయట పెడుతుందని వెల్లడించారు. తనకు ఎంత నష్టం జరుగుతున్నా అమెరికా ఫస్ట్ నినాదం కోసం చాలా కష్ట పడుతున్నాడని చెబుతూనే.. ఎలాన్ మస్క్ గొప్ప దేశ భక్తుడు అని వ్యాఖ్యానించారు.
![]() |
![]() |