కేంద్ర ప్రభుత్వం గేమింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్‌పై కీలక ప్రకటన చేసింది. ఈ అంశాలకు సంబంధించి రాష్ట్రాలు చట్టాలు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు. వీటిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ, తమిళనాడు ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించిందని, దీనిపై చర్యలు తీసుకోవడంలో కేంద్రం తన నైతిక బాధ్యత నుంచి తప్పించుకుంటోందా అని మారన్ ప్రశ్నించారు.అశ్వినీ వైష్ణవ్ స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం నైతికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ఈ అంశంపై చట్టాలు రూపొందించేందుకు రాష్ట్రాలకు రాజ్యాంగం నైతిక, చట్టబద్ధ అధికారాన్ని ఇచ్చిందని స్పష్టం చేశారు. సమాఖ్య నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది రాష్ట్రాల పరిధిలోని అంశమే అయినప్పటికీ, తమకు అందిన ఫిర్యాదుల ఆధారంగా 1,410 గేమింగ్ సైట్లను నిషేధించినట్లు ఆయన తెలిపారు.
![]() |
![]() |