ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానం సాంకేతిక లోపం కారణంగా ఆగ్రాలోని ఖేడియా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.ఆగ్రా పర్యటనలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ మధ్యాహ్నం 3.40 గంటలకు పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి, ముందు జాగ్రత్తగా ఖేడియా విమానాశ్రయంలో దింపారు.ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోసం ఢిల్లీ నుండి మరో విమానాన్ని పంపించారు. ఆయన సుమారు గంటన్నర సేపు ఆగ్రా విమానాశ్రయ లాంజ్‌లో వేచి ఉన్నారు. ప్రత్యామ్నాయ విమానం చేరుకున్న తర్వాత లక్నోకు బయలుదేరారు
![]() |
![]() |