ప్రముఖ క్రైస్తవ సువార్తీకుడు ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి నేపథ్యంలో బుధవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రి వద్ద రోజంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్రైస్తవ సంఘాల నాయకు లు, ప్రవీణ్ అనుచరులతోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు చెందిన క్రైస్తవ ప్రముఖులు ఆసుప త్రి వద్దకు చేరుకున్నారు. ప్రవీణ్ కుమార్ ప్రమాదవశాత్తు చనిపోలేదని.. ఆయన హత్యకు గురయ్యార ని పేర్కొంటూ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రవీణ్ మృతదేహానికి అధికారులు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం పూర్తిచేశారు. అనంతరం.. బందోబస్తు మధ్య మృత దేహాన్ని అంబులెన్సులో హైదరాబాద్‌కు తరలించారు. ఇదిలావుంటే.. క్రైస్తవ విశ్వాసులు పెద్దసంఖ్యలో మోకాళ్లపై నిలబ డి ప్రవీణ్‌కు న్యాయం జరగాలంటూ నినాదాలు చేశారు. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ పోస్టుమార్టం జరుగుతున్న మార్చురీ గది లోపలకు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాగా, ప్రవీణ్ మృతి కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోందని ఎస్పీ నరసింహ కిశోర్ తెలిపారు. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నా రు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయన్నారు.
![]() |
![]() |