మీరు కలెక్టర్ల సదస్సు కోసం సిద్ధం కాకుండా గౌరవ పౌరుల్లా వస్తున్నారు. కానీ, బాధ్యతగల పౌరులుగా అన్ని విషయాలు తెలుసుకుని రావాలి. ఐఏఎస్ కోసం ఎంత ప్రిపేర్ అయ్యారో అంతకంటే మెరుగ్గా మీ సంసిద్ధత ఉండాలి.’’ అని కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కాగితాలు చదవడానికి కలెక్టర్లు వస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు. ఐపీఎ్‌సల్లో కొందరు చాలా కొత్తగా, సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారని, కొత్త యాప్స్ తీసుకొస్తున్నారన్నారు. కానీ, ఐఏఎ్‌సలు అలా ఉండటం లేదని అసంతృప్తి వ్యక్తం ఏశారు. ‘‘మీరు అడ్మినిస్ర్టేషన్ సర్వీ్‌సలో ఉన్నారు. కానీ, మెరుగ్గా పనిచేయడం లేదు. మీ నాలెడ్జ్ ఇక్కడ చూపిస్తున్నారు. నాకు కావాల్సింది అది కాదు. మీరు ఏమి చేశారో చెప్పండి. ఇక్కడ విజ్ఞాన ప్రదర్శనలు వద్దు. ఏం చేయబోతున్నారో చెప్పండి’’ అంటూ కలెక్టర్లకు చంద్రబాబు క్లాసు తీసుకున్నారు. కలెక్టర్ల సదస్సు చివరి రోజు బుధవారం జిల్లాల వారీగా సీఎం సమీక్షలు నిర్వహించారు. ‘‘ఏప్రిల్ నుంచి గ్రామాలకు సీనియర్ అధికారులు వెళ్లి ప్రజల జీవన ప్రమాణాలు తదితర అంశాలపై అధ్యయనం చేయాలి. అసలు గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడమే సదస్సు ఉద్దేశం.’’ అని చంద్రబాబు వివరించారు.
![]() |
![]() |