జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో సారి కాల్పులకు తెగబడ్డారు. కఠువాలో జిల్లాలో భద్రతా బలగాల వాహనాలపై కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు తిప్పి కొట్టాయి.భద్రతా బలగాలు గత నాలుగు రోజులుగా యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.బలగాలను తరలించామని, మరిన్ని వివరాల కోసం ఎదురు చూస్తున్నామని వారు తెలిపారు. ఆదివారం సాయంత్రం జిల్లాలోని హీరానగర్ సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత తప్పించుకున్న ఉగ్రవాదులు కూడా ఇదే గుంపు అని భావిస్తున్నారు.
![]() |
![]() |