మడకశిర మండలం ఉప్పర్లపల్లిలోని ఎంపీపీ ఎస్ ప్రభుత్వ పాఠశాలను గురువారం మండల ఎంఈఓ నరసింహమూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను ఆయన పరిశీలించారు.
అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో స్వయంగా వారి నైపుణ్యాన్ని పరీక్షించారు. పాఠశాలలో విద్యార్థులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని పాఠశాల సిబ్బందికి ఎంఈఓ సూచించారు.
![]() |
![]() |