సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని బ్రహ్మేశ్వరంపల్లిలో బుధవారం రాత్రి మహిళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మండల పరిధిలోని మొరసలపల్లికి చెందిన అర్చనను బ్రహ్మేశ్వరం పల్లి గ్రామానికి చెందిన శివశంకర్ వివాహం చేసుకున్నాడు.
వారికి కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె బలవన్మరణానికి పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కుమార్తెను అత్తింటి వారే చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
![]() |
![]() |