కణేకల్ ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ విజయం పట్ల రాయదుర్గం వైసీపీ సమన్వయకర్త మెట్టు గోవింద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అందరి సమిష్టి కృషితో ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వాండ్రప్ప విజయం సాధించారని అన్నారు.
పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఎంపీపీ అభ్యర్థి విజయానికి అండగా నిలబడ్డారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఇలాగే సమష్టిగా కృషి చేయాలన్నారు.
![]() |
![]() |