కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా నందిని పాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటరుపై ఏకంగా రూ.4 పెంచుతున్నట్లు ప్రకటించింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, రైతు సంఘాల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో రూ.44గా ఉన్న ఒక లీటరు నందిని పాల ప్యాకెట్ ధర రూ.48కి పెరగనుంది. పెరుగు ధర రూ.50 నుంచి రూ.54కి పెరుగుతుంది.కాగా, నందిని పాల ధరలను కేఎమ్‌ఎఫ్ ఏటా పెంచుతూ వస్తున్న విషయం తెలిసిందే. చివరిసారిగా జూన్ 2024లో నందిని పాల ధరలను పెంచిన విషయం తెలిసిందే. అప్పుడు లీటరుపై రూ.2 పెంచింది. అంతకు ముందు జులై 2023లో నందిని పాల ధరలను లీటరుపై రూ.3 పెంచింది. ఇప్పుడే ఏకంగా రూ.4 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం.ఇక కాఫీ బ్రూవర్ల సంఘం ఇటీవలే మార్చి నాటికి కాఫీ పౌడర్ ధరలను కిలోకు రూ.200 పెంచనున్నట్లు ప్రకటించింది. ఇక BMTC బస్సులు, నమ్మ మెట్రో టికెట్ ఛార్జీలు పెరిగాయి. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నీటి సుంకాన్ని పెంచేందుకు పరిశీలన చేస్తోంది. ఇంతలో, విద్యుత్తు వినియోగదారులపై భారం పడనున్నది.
![]() |
![]() |