2025 ఐపీల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎం.ఎ.చిదంబరం స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు ఈ పోరు ఆరంభం కానుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఈ రెండు జట్లు 33 సార్లు తలపడగా, CSK 21 సార్లు విజయం సాధించి ఆధిపత్యం చెలాయించింది. RCB కేవలం 11 సార్లు మాత్రమే గెలిచింది. చెపాక్‌లో CSK రికార్డు మరింత బలంగా ఉంది, ఇక్కడ 9 మ్యాచ్‌లలో 8 సార్లు విజయం సాధించింది.
ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. అయితే ఇరు జట్లలో మంచి బ్యాటర్లున్నారు. సమయానికి వికెట్లు తీసే బౌలర్లున్నారు. ముఖ్యంగా ధోనీ, కోహ్లీ ఒకే మైదానంలో కనపడుతుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ స్టేడియంలో ఊగిపోతారని చెప్పకతప్పదు. చెవులు దద్దరిల్లే సౌండ్ తో నినాదాలు కూడా చేస్తారు. చెన్నైకు ముగ్గురు స్పినర్లు బెంగళూరు ను దెబ్బతీసేందుకు మరోసారి రెడీగాఉన్నారు. ఇక బ్యాటింగ్ లలో ఇరు జట్లు కూడా సమానమైన బలం ఉండటంతో ఈ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తుందని చెప్పకతప్పదు.
![]() |
![]() |