దేశవ్యాప్తంగా ర్యాపిడో పింక్ మొబిలిటీ సేవలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. భారత్‌లో 2 లక్షల మంది మహిళలను కెప్టెన్లుగా మార్చాలని యోచిస్తోంది. రాబోయే మూడేళ్లలో ఈ ప్రణాళికను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, మహిళా డ్రైవర్లతో ఈ సేవలను ప్రారంభించగా.. ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.పింక్ మొబిలిటీ విస్తరణ కోసం ఆజాద్ ఫౌండేషన్, శాఖా కన్సల్టింగ్ వింగ్స్‌తో ర్యాపిడో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ త్రిముఖ ఒప్పందం ద్వారా నిరుపేద మహిళలకు ప్రొఫె షనల్ డ్రైవింగ్ నైపుణ్యాలను అందించడం, వారికి ఉద్యోగావకాశాలు కల్పించడం, రవాణా రంగంలో ఆర్థిక సాధికారతను ప్రోత్సహించనుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మహిళలకు నెలకు గరిష్ఠంగా రూ.25వేల వరకు స్థిరమైన ఆదాయం పొందేలా దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను సమకూర్చుతుందని కంపెనీ తెలిపింది. అవకాశాలను సృష్టించడంతో పాటు వారికి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.
![]() |
![]() |