టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓపెనింగ్ జోడీగా దిగిన అభిషేక్ శర్మ – సంజూ శాంసన్ బ్యాటింగ్ ప్రదర్శన అభిమానుల మదిలో చాలా కాలం నిలిచిపోయేలా చేసింది. ఇద్దరూ కలిసి బౌండరీల వరద పారించి ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేశారు.వారి దూకుడు చూసి ఫ్యాన్స్ “ఇదేం విధంగా చితక్కొట్టార్రా!” అని ఆశ్చర్యపోయారు. ఈ మ్యాచ్‌లో జరిగిన భాగస్వామ్యంపై సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “మా జోడీ ఐస్ అండ్ ఫైర్ కాదు… ఫైర్ అండ్ ఫైర్” అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.ఇండియా టుడే 2026 కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న సంజూ, ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్‌తో ఉన్న కెమిస్ట్రీ గురించి మాట్లాడాడు. “మేము ఐస్ అండ్ ఫైర్ జోడీ కాదు… ఫైర్ అండ్ ఫైర్. కొన్ని సందర్భాల్లో అతడు ఫైర్ అయితే, మరోసారి నేను ఫైర్ అవుతాను. మా కాంబినేషన్ అలాంటిది. 2024 నుంచి ఇదే ఫార్ములాతో ఆడుతున్నాం. అంతేకాదు కేరళ–పంజాబ్ ఫ్రెండ్షిప్ కూడా కొనసాగుతోంది. దీనిని మేము క్లిష్టం చేయాలనుకోవడం లేదు” అని తెలిపాడు.ఫైనల్ మ్యాచ్‌లో ఈ జోడీ మొదటి వికెట్‌కు 98 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేసింది. పవర్‌ప్లేలోనే మంచి ఆరంభం రావడంతో జట్టు స్కోర్ 255 పరుగుల వరకు వెళ్లింది.బ్యాటింగ్ సమయంలో అభిషేక్ తరచూ “బాల్ ఎలా వస్తోంది?” అని అడుగుతాడని సంజూ చెప్పాడు. “నేను నార్మల్‌గా వస్తోంది… సిక్స్ కొట్టేయ్ అని చెప్పేస్తుంటా. అభిషేక్ చాలా ధైర్యంగా ఆడే బ్యాట్స్‌మన్. అతని స్వభావం నాకు చాలా ఇష్టం. మైదానంలోనూ, బయట కూడా అతనితో ఉన్న భాగస్వామ్యం నాకు చాలా నచ్చుతుంది” అని శాంసన్ పేర్కొన్నాడు.కంబ్యాక్ స్టోరీ టీ20 వరల్డ్ కప్ 2026లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఇద్దరికీ ఇది ఒక గొప్ప కంబ్యాక్ కథగా నిలిచింది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు సంజూ జట్టులో స్థానం కోల్పోయి బెంచ్‌కే పరిమితమయ్యాడు. మరోవైపు అనారోగ్య సమస్యల వల్ల అభిషేక్ కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు.అయితే చివరి నాలుగు మ్యాచ్‌ల్లో సంజూకు అవకాశం రావడంతో అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు కీలకంగా నిలిచాడు. మరోవైపు టోర్నమెంట్ ప్రారంభంలో ఫామ్‌లో లేక విమర్శలు ఎదుర్కొన్న అభిషేక్, ఫైనల్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి విమర్శకులకు సమాధానం ఇచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa