మయన్మార్, థాయ్‌లాండ్‌లో శుక్రవారం సంభవించిన భూకంపాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భూకంపంలో చిక్కుకున్న ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు.
అవసరమైన సహాయ కార్యక్రమాలు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. సహాయ చర్యలపై సంప్రదించాలని విదేశాంగ శాఖను ప్రధాని ఆదేశించారు. భారత్‌లోని పలు ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.
![]() |
![]() |