టెక్నాలజీలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న 11 ఏళ్ల అఖిల్ ఆకెళ్ల మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. 11 ఏళ్ల అఖిల్ ఆకెళ్ల తన తండ్రితో కలిసి ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా అఖిల్ ఆకెళ్లను నారా లోకేష్ అభినందించారు. ఏపీకి చెందిన అఖిల్ ఆకెళ్ల.. యూకేలో చదువుకుంటున్నారు. చిన్న వయసులోనే మైక్రోసాఫ్ట్ ధృవీకరించిన అజ్యూర్, డేటా సెక్యూరిటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫౌండేషన్ కోర్సుల్లో సర్టిఫికేషన్లు పొందారు. యూకేలో నిర్వహించిన పలు సాంకేతిక సదస్సులలోనూ అఖిల్ ఆకెళ్ల పాల్గొన్నాడు. అయితే అఖిల్ ఆకెళ్లను కలుస్తానని నారా లోకేష్ గతంలో మాట ఇచ్చారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం అఖిల్ ఆకెళ్లను కలిశారు నారా లోకేష్. అఖిల్ ఆకెళ్ల ముందు ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న సమయంలో అఖిల్ ఆకెళ్ల ప్రతిభ వెలుగులోకి వచ్చింది. కొవిడ్ లాక్ డౌన్ సమయంలో కోడింగ్ నైపుణ్యాలతో ఆరు మైక్రోసాఫ్ట్ ఐటీ సర్టిఫికేట్లు సాధించుకున్నాడు. ఇండస్ట్రీ అవసరాలకు తగినట్లుగా ఏఐ సొల్యూషన్స్ అందిస్తూ ఉంటారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆసక్తి ఎక్కువ ఉన్న అఖిల్ ఆకెళ్ల.. 2025లో జరిగే టెక్ షోలో పాల్గొనాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో పిల్లల కోసం స్క్రాచ్ పేరుతో ఉచిత కోడింగ్ ప్లాట్‌ఫామ్ రూపొందించారు అఖిల్ ఆకెళ్ల. సొంతంగా ఆన్‌లైన్ గేమ్స్ తయారు చేసుకోవడంతో పాటుగా యానిమేషన్‌ల ద్వారా పాత్రలకు ప్రాణం పోస్తుంటాడు.
ఐటీ రంగంలో తనకు ఎంతోమంది ప్రముఖులు స్ఫూర్తిగా నిలుస్తారని అఖిల్ ఆకెళ్ల చెప్తున్నారు. స్టీవ్ జాబ్స్, సుందర్ పిచాయ్, బిల్ గేట్స్ ఇలాంటి ఐటీ దిగ్గజాలు తనకు స్ఫూర్తి అని అఖిల్ ఆకెళ్ల చెప్తున్నారు. టెక్నాలజీ మీద తనకు ఉన్న ప్రేమే.. తనను ముందుకు నడిపిస్తోందని అఖిల్ ఆకెళ్ల చెప్తున్నాడు. మరోవైపు ప్రైమరీ స్కూలు విద్యార్థుల కోసం అఖిల్ ఆకెళ్ల ఎడ్యుకేషనల్ యాప్స్ కూడా తయారు చేశారు. సేవ్ పేపర్, సేవ్ ఎర్త్ పేరుతో ఇతను రూపొందించిన ప్రజెంటేషన్, సర్వేకు యూకే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా అభినందనలు రావటం విశేషం.
![]() |
![]() |