వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవరెడ్డిలకు హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. సజ్జల, ఆయన కుమారుడు ఇచ్చిన స్క్రిప్ట్, ప్రోత్సాహంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులు, కమ్మ సామాజిక వర్గాన్ని అసభ్య పదజాలంతో దూషించినట్టు సినీ నటుడు పోసాని కృష్ణమురళి నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఓబుళవారిపల్లె పోలీసులు వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. వీరి బెయిల్ పిటిషన్‌ను నిన్న విచారించిన హైకోర్టు ఇద్దరికీ ముందస్తు బెయిలు మంజూరు చేసింది. రూ. 10 వేల చొప్పున ఒక్కొక్కరు రెండు పూచీకత్తులు సమర్పించాలని పేర్కొంది. అలాగే, దర్యాప్తుకు సహకరించాలని జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.
![]() |
![]() |