మయన్మార్, థాయ్ లాండ్ లలో వచ్చిన భూకంప తీవ్రతకు ఎన్నో భవనాలు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో అంచనా వేయలేని పరిస్థితి ఉంది. ఇదిలా ఉండగా మయన్మార్ రాజధాని నేపిడాలో వెయ్యి పడకల ఆసుపత్రి కుప్పకూలింది. ఎక్కువ ప్రాణ నష్టం, అత్యధికంగా క్షతగాత్రులు ఇక్కడే ఉంటారని భావిస్తున్నారు. ఈ ఆసుపత్రిని కొత్తగా నిర్మించారు. ఇంకా పేరు కూడా పెట్టలేదు. ఆసుపత్రి శిథిలాల్లో తమ ఆత్మీయుల కోసం ఎంతో మంది గాలిస్తున్నారు. ఈ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.అలానే మయన్మార్ లోని మాండలేలో మసీదు కూలి దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. టవుంగూలో పునరావాస కేంద్రం కుప్పకూలి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాల్లో సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి.
![]() |
![]() |