కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 2 శాతం పెంచుతున్నట్టు మోడీ ప్రభుత్వం వెల్లడించింది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తాజా పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 53 శాతం నుంచి 55 శాతానికి పెరిగింది. అటు, రూ.22,919 కోట్లతో పీఎల్ఐ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా దేశీయ ఎలక్ట్రానిక్స్ రంగానికి ఊతం లభించనుంది. ముఖ్యంగా నాన్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు చేయూతనివ్వడమే ఈ కొత్త పథకం ముఖ్య ఉద్దేశం.
![]() |
![]() |