చాట్ జీపీటీ ఆఫర్ చేస్తున్న ఘిబ్లీ స్టూడియో ఫీచర్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. ప్రముఖులు సైతం ఒక్కొక్కరుగా ఘిబ్లీ సాయంతో తమ ఫొటోలను యానిమే స్టయిల్లోకి మార్చుకుంటున్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే ఘిబ్లీ గ్యాంగ్ లో చేరానని ప్రకటించగా... తాజాగా తాను కూడా ఎంట్రీ ఇచ్చానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఘిబ్లీ ట్రెండ్ లో చేరుతున్నాను... ఇదిగో నా ఎంట్రీ అంటూ చంద్రబాబు పలు ఫొటోలను పంచుకున్నారు. కూటమి విజయోత్సవ సభలో తాను, ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్న ఫొటో... తన ఫ్యామిలీ ఫొటో, వరద బాధితుల పరామర్శ ఫొటోను చంద్రబాబు ఘిబ్లీ స్టయిల్లోకి మార్చి, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
![]() |
![]() |