ఓ వృద్ధురాలి అంతిమయాత్రలో బాణ సంచా పేలుడుకు తేనెతుట్టె కదిలి కలకలం రేగింది. అంతిమయాత్రలో పాల్గొన్నవారిపై తేనెటీగలు దాడి చేయడంతో మృతదేహాన్ని రెండు గంటలపాటు రహదారిపై వదిలి పరుగులు తీశారు. ఈఘటన అల్లూరి జిల్లా ఎటపాక మండలం గన్నేరుకొయ్యపాడులో జరిగింది. తేనెటీగల దాడిలో 26 మంది గాయపడ్డారు. ముగడ చంద్రశేఖర్ అనే వ్యక్తి తేనే టీగల దాడిలో స్పృహ కోల్పోయాడు. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చివరికి బంధువులు మృతదేహాన్ని ట్రాక్టర్‌లో శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.
![]() |
![]() |