గుంటూరు జిల్లా తాడేపల్లి కనకదుర్గమ్మ వారధిపై పెను ప్రమాదం తప్పింది. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి విశాఖకు అద్దాల లోడుతో వెళ్తున్న ఆటో పంక్చర్ అయ్యింది. టైర్ పగిలిపోవటంతో రోడ్డు పక్కన ఆపారు. అయితే అదే సమయంలో నెల్లూరు ఆర్టీసీ బస్సు వెనుక నుంచి వచ్చి ఆటోను ఢీకొంది. దీంతో ఆటో బోల్తా కొట్టి వంతెన రెయిలింగ్‌పై పడింది. దీంతో నిర్మాణం దెబ్బతింది. అలాగే బస్సు ముందు భాగం కొంత దెబ్బతింది. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో సుమారు 25 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రమాదం కారణంగా వంతెనపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఉదయం 11 గంటలకు ట్రాఫిక్ క్లియర్ అయ్యింది.
![]() |
![]() |