కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల గోపవరం ఉప సర్పంచ్ ఎన్నికలకు ఏర్పాట్లు చేసి ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో ఎన్నికను వాయిదా వేశారు. ఈ క్రమంలో రాచమల్లు స్పందించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే వరద రాజులు అనుచరులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, పోలీసులు వారికి సహకరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలకు సపోర్ట్ చేసే పోలీసులను వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు.
![]() |
![]() |