నేరాల నియంత్రణకు కృష్ణా జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెడుతున్నారు. తాజాగా గుడివాడ పరిధిలో మద్యం సేవిస్తున్న ఇద్దరు యువకులను డ్రోన్ వెంబడించింది.
డ్రోన్ చూసి వారు పరుగులు తీయగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని చూస్తే జాలేస్తుంది. కానీ నేనెలాంటి సాయం చేయలేను. పోలీస్ డ్రోన్లు వాటి పని అవి చేస్తున్నాయి.’ అని ట్వీట్ చేశారు.
![]() |
![]() |