మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆచూకీ కోసం పోలీసులు మూడు బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాజాగా కాకాణి కేసులో మరో ముగ్గురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
కాకాణి చిన్న అల్లుడు గోపాలకృష్ణారెడ్డి, కాంట్రాక్టర్లు ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి, ఉరుబిండి చైతన్యకు నోటీసులు ఇచ్చారు. ఇవాళ నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
![]() |
![]() |