స్టాక్‌మార్కెట్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. యువత స్టాక్‌మార్కెట్లకు దూరంగా ఉండాలని రాహుల్ గాంధీ సూచించారు. స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బులు సంపాదించడం భ్రమ అని ఆయన పేర్కొన్నారు. దేశ జనాభాలో కేవలం ఒక శాతం మాత్రమే స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారని రాహుల్ అన్నారు. ప్రస్తుత సమయంలో స్టాక్‌మార్కెట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని రాహుల్ తెలిపారు.అమెరికా అధ్యక్షుడు స్టాక్ మార్కెట్ పతనానికి దారితీశారు. ఇక్కడి ప్రజలలో 1 శాతం కంటే తక్కువ మంది మాత్రమే తమ డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు, అంటే స్టాక్ మార్కెట్ మీకు ఒక రంగం కాదు. దానిలో అపరిమిత డబ్బు సంపాదిస్తారు, కానీ మీకు దాని ప్రయోజనం లభించదు" అని గాంధీ పాట్నాలో జరిగిన 'సంవిధాన్ సురక్ష సమ్మేళన్' (రాజ్యాంగాన్ని కాపాడే సింపోజియం)లో ప్రసంగిస్తూ అన్నారు
![]() |
![]() |