2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను అసోసియేటెడ్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. అయితే అనేక జాతీయ పార్టీలు పెద్ద మొత్తంలోనే విరాళాలు పొందినప్పటికీ.. దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.2,243 కోట్లకు పైగా విరాళాన్ని అందుకుంది. అయితే ఈ విరాళం జాతీయ రాజకీయ పార్టీల్లో కాషాయ పార్టీకే అత్యధికం. ఎన్నికలు సంబంధించిన సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తన నివేదికలో ఈ సమాచారాన్ని అందించింది. అయితే ఈ నివేదిక ఎన్నికల సంఘానికి సమర్పించిన డేటా ఆధారంగా రూపొందించబడింది. ఈ గణాంకాల్లో రూ.20 వేలకు పైగా రాజకీయ విరాళాల గురించి సమాచాన్ని ఇచ్చింది.
ముఖ్యంగా 12,547 మంది దాల నుంచి రూ.2,544.28 కోట్లు విరాళంగా వచ్చాయి. అయితే గతేడాది కేవలం రూ.12.547 కోట్లు మాత్రమే రాగా.. ఈ సంవత్సరం 199 శాతం ఎక్కువ డబ్బు విరాళంగా వచ్చింది. ప్రకటించిన మొత్తం విరాళంలో బీజేపీ వాటా ఒక్కటే 88 శాతం. మొత్తంగా 1, 994 మంది దాతలు రూ.2,243 కోట్ల రూపాయలను కాషాయ పార్టీకి అందజేశారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈ విరాళాల్లో 211 శాతం పెరుగుదల కనిపించింది. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రూ.281 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. బీజేపీతో పోలిస్తే హస్తం పార్టీకి అందిన విరాళాలు చాలా తక్కువ. కానీ గతేడాదితో పోలిస్తే ఈ విరాళాలు చాలా ఎక్కువే.
2022-23 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి రూ.79.924 కోట్ల రాగా.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.281.48 కోట్లకు పెరిగింది. ఇలా 252.18 శాతం విరాళాలు పెరిగాయని నివేదిక పేర్కొంది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, నేషనల్స్ పీపుల్స్ పార్టీలకు చాలా తక్కువ మొత్తంలో విరాళాలు వచ్చాయి. ఇక బీఎస్పీ మరోసారి తమకు ఎలాంటి విరాళాలు రాలేవని ప్రకటించింది.
![]() |
![]() |