ఓ వ్యక్తి లిఫ్ట్‌లో చేసిన గలీజు పని తాలూకు వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. సదరు వ్యక్తి లిఫ్ట్ లో మూత్రం పోయడం వీడియోలో ఉంది. లిఫ్ట్‌లో కెమెరాలు ఉన్న సంగతి గుర్తించని ఆ వ్యక్తి... లోపలికి వెళ్లగానే ఆ పని కానిచ్చేశాడు. తర్వాత తాను దిగాల్సిన ఫ్లోర్ రాగానే లిఫ్ట్ దిగి వెళ్లిపోయాడు. కానీ, అతడు చేసిన ఆ పిచ్చి పని లిఫ్ట్ కెమెరాల్లో రికార్డు కావడం, ఆ వీడియో కాస్తా బయటకు రావడం జరిగింది. దాంతో సదరు వ్యక్తిపై... వీడియో చూసినవారు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని కొందరు, ఇదేం పాడు బుద్ధి... ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా అని మండిపడుతున్నారు.
![]() |
![]() |