ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచీ ఆడుతున్నా.. గత కొన్నేళ్లుగా కనీసం ప్లే ఆఫ్స్ కూడా వెళ్లలేకపోయిన పంజాబ్ కింగ్స్.. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింట్లో గెలిచిన ఆ జట్టు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని.. ఏకంగా 245/6 పరుగులు చేసింది. అసలు ఫామ్‌లేమితో సతమతమవుతున్న సన్‌రైజర్స్‌ను భయపెట్టే లక్ష్యం నిర్దేశించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్.. ఫస్టు బ్యాటింగ్‌కు మొగ్గు చూపాడు. గత మ్యాచ్‌లో సెంచరీ హీరో.. ప్రియాన్ష్ ఆర్య మరోసారి మెరుపు శుభారంభం ఇచ్చాడు. 13 బంతుల్లో 36 రన్స్ స్కోరు చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ అయ్యర్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్లే బాది.. ఐపీఎల్ చరిత్రలో తన వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లోనే అయ్యర్ ఫిఫ్టీ రన్స్ మార్క్‌ను చేరుకున్నాడు.
ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు. ఈ టోర్నీలో తాను ఆడిన తొలి మ్యాచ్‌లో 99* నాటౌట్‌తో నిలిచిన అతడు.. ఈసారి పక్కాగా సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ 36 బంతుల్లో 82 రన్స్ చేసిన తర్వాత అతడు ఔట్ అయ్యాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (3) మళ్లీ విఫలమయ్యాడు. చివర్లో మార్కస్ స్టోయినిస్.. మహమ్మద్ షమీకి చుక్కలు చూపించాడు. చివరి ఓవర్‌లో చివరి నాలుగు బంతులను స్టాండ్స్‌లోకి తరలించాడు. 11 బంతుల్లో 34 రన్స్ చేసి.. నాటౌట్‌గా నిలిచాడు. దీంతో పంజాబ్ కింగ్స్.. 245/6 పరుగులు చేసింది.
సన్‌రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇషాన్ మలింగ 2 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ ద్వారా మహమ్మద్ షమీ ఓ చెత్త రికార్డును నెలకొల్పాడు. నాలుగు ఓవర్లలో 75 రన్స్ సమర్పించుకుని.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా నిలిచాడు.
![]() |
![]() |