అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు జరిగిన ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కాగా, వారిని నర్సీపట్నంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులు సామర్లకోటకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. ఈ మధ్యాహ్నం జరిగిన పేలుడుతో పరిసర ప్రాంతాల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి పలు నిర్మాణాలు నేలమట్టం అయ్యాయి.
![]() |
![]() |