చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో కొలువైన నారాయణ స్వామి ఆలయంలో ఆదివారం పండితులు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఆలయానికి తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో నరసింహా బాబు, చైర్మన్ కొమ్మినేని చిన్న ఆదినారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
![]() |
![]() |