ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1000 రోజులు నాన్ స్టాప్ బ్లీడింగ్..:ఓ మహిళకు వింత పరిస్థితి

international |  Suryaa Desk  | Published : Sun, Apr 13, 2025, 08:34 PM

అమ్మాయిలు.. బంగారు తల్లులు.. ధయచేసి ఈ స్టోరీని మొత్తం చదివి.. మీ ఆరోగ్యం ఎలా ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి.. ఇంటిలో అందరి కోసం కష్టపడుతుంటా . కానీ.. ఈ క్రమంలో మీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి. నెలలో మూడు రోజులు పీరియడ్స్ వస్తేనే నరకంలా ఉంటది. పెయిన్, అన్ కంఫర్టబిలిటి, హార్మోన్ల మార్పుల వల్ల చిరాగ్గా, మూడ్ స్వింగ్స్ మాములుగా ఉండవు. ఏ పని మీద పూర్తిగా ధ్యాసపెట్టలేం. అలాంటిది.... మూడు నాలుగు రోజులు కాకుండా నెల మొత్తం బ్లీడింగ్ అయితే.. సంవత్సరం మొత్తం పీరియడ్స్ లోనే ఉంటే..? సంవత్సరమైనా.. జస్ట్ 365 డేస్ మాత్రమే.. కానీ.. అమెరికాకు చెందిన పాపీ అనే టిక్‌టాక్‌ యూజర్‌ .. వెయ్యి రోజులకు పైగా పీరియడ్స్‌లోనే ఉంది.. దాదాపు మూడేళ్లలో రక్తపు మరకలు చూడకుండా ఒక్క రోజు కూడా ఆమెకు గడవలేదట.


పీరియడ్స్ ప్రతి 27 నుంచి 35 రోజుల్లో వస్తుంది. ఇలా వస్తే ఆరోగ్యంగా ఉన్నట్లుగా వైద్యులు పరిణిస్తారు. రెండు నుంచి ఏడు రోజుల వరకే రక్తస్రావం అవుతుంది. కొందరికి లైఫ్ స్టైల్, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వల్ల ఇర్‌రెగ్యులర్‌గా వచ్చినా మహా అయితే ఓ 15 నుంచి 20 రోజుల ఉంటుందేమో... అది కూడా కొందరికే. ఇది ప్రస్తుత లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ లేని ఉద్యోగాలు, కాలుష్యం ఇలా చాలా కారణాల వల్ల చాలామంది టీనేజర్లు, మహిళలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఇది.


పాపీకి కూడా ఇలానే ఇర్‌రెగ్యులర్ పీరియడ్స్ అనుకుని కొన్ని రోజులు పట్టించుకోలేదు.. తనను వింతగా చూస్తారేమో అని కొన్ని నెలల పాటు ఎవరికీ చెప్పలేదట. తర్వాత మెల్లిగా ధైర్యం చేసి డాక్టర్ దగ్గరికి వెళ్లింది. డాక్టర్స్ కొన్ని వైద్య పరీక్షలు చేసి ఎందుకు ఇలా జరుగుతుందో కనుగొనే యత్నం చేశారు. అండాశయంపై తిత్తులు ఉన్నట్టు గుర్తించారు గానీ, దానివల్ల ఇంతలా రక్తస్రావం జరగదనే చెబుతున్నారు వైద్యులు. మరేంటి కారణం అనేది అంతుపట్టడం లేదు వైద్యులకు. దీనికారణంగా పాపీ ఐరన్‌ విటమిన్‌ని అధిక స్థాయిలో కోల్పోయి తిమ్మిర్లు, కండరాలు, ఎముకల సమస్యలతో విలవిలలాడుతుందని చెబుతున్నారు డాక్టర్స్.


అయితే ఆమెకు పీసీఓడీ ఉందని నిర్థారణ అయ్యినప్పటికీ.. ఇంతలా రక్తస్రావం జరగడానికి ప్రధాన కారణం ఏంటన్నది నిర్థారించలేకపోయారు. చివరికి హిస్టెరోస్కోపీ నిర్వహించారు, గర్భ నిరోధక ఐయూడీని కూడా చేశారు. ఇవేమీ ఆ సమస్యను తగ్గించలేదు. ఇలా ఎన్నో వైద్యపరీక్షలు, వివిధ చికిత్సలు, మందులు తీసుకున్నప్పటికీ హెవీ బ్లీడింగ్ సమస్యను ఆగలేదు. అల్ట్రాసౌండ్‌, ఎంఆర్‌ఐ వంటి స్కానింగ్‌లలో సైతం కారణం ఏంటన్నది చూపించలేకపోయాయి. చివరికి తన టిక్‌టాక్‌లో తన సమస్య చెప్పి తన దీన స్థితిని పంచుకుంది. దీంతో ఆమె ఫాలోవర్స్‌ సాయంతో తన సమస్యకు గల కారణాన్ని తెలుసుకుని నివ్వెరపోయింది పాపీ.


ఆమెకు బైకార్నుయేట్ ఓవరీ అనే అరుదైన సమస్య ఉందని తెలుసుకుంది. దీన్ని గుండె ఆకారపు గర్భాశయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ గర్భాశయం ఒకటి కాకుండా రెండు గదులుగా వేరుచేయబడి ఉంటుంది. ఈ పరిస్థితి.. నూటికి ఒకరిలోనే ఉండే అరుదైన సమస్యంట ఇది. ఈ పరిస్థితితో ఉన్న చాలా మంది మహిళలకు ఇలానే రక్తస్రావం జరగుతుందా అంటే..ఒక్కొక్కరిలో ఒక్కోలా లక్షణాలు ఉంటాయని ఫాలోవర్‌ వివరించడంతో ఒక్కసారిగా ఊపిరిపీల్చుకుంది.


ఇన్నాళ్లకీ తన సమస్యకు ప్రధాన కారణం ఏంటన్నది తెలుసుకోగలిగానని కాస్త కుదుటపడింది. ఇన్నాళ్లు దాదాపు 950 రోజులు పీరియడ్స్‌ ప్యాడ్లలకే డబ్బులు వెచ్చించి విసుగొచ్చేసింది. ఇక ఆ సమస్యకు కారణం ఏంటో తెలియక ఇంకా పిచ్చెక్కేది.. ఏ పని చేయలేకపోయేదాన్ని.. బరువు పెరిగిపోయా.. అందరు వెక్కిరించేవారు అని కన్నీళ్లు పెట్టుకుంది పాపీ.. ఇక ఇప్పుడు..పరిష్కారం దిశగా అగుడులు వేస్తానంటోంది పాపీ. ప్రస్తుతం ఆమె వైద్యులను సంప్రదించి.. తన గుండె ఆకారపు గర్భాశయాన్ని సరిచేసే సర్జరీ గురించి తెలుసుకునే పనిలో ఉంది. అంతేకాదు ఇది గనుక విజయవంతమైతే.. రోజూ రెడ్ డాట్ చూడని స్వర్గం లాంటి రోజులను మళ్లీ పొందగలుగుతానంటోందామె.


కాబట్టి.. ఇలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎవ్వరికీ చెప్పకుండా మీలో మీరే తగ్గిపోతుందిలే అని అనుకోవద్దు.. ఇలా అనుకునే సమస్యను పెద్దది చేసుకుంటారు. అందుకే నలుగురికి చెప్తే ఎవరో ఒకరు మంచి సలహా ఇచ్చే అవకాశం ఉంది .అంతేకాదు, అమ్మాయిల జీవనశైలి కూడా రోజు రోజుకు మారిపోతుంది.. ఆ ఊబిలో పడకుండా.. వీలైనంతవరకు ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com