బాపట్ల మండలం వెదుళ్ళపల్లి గ్రామానికి చెందిన పోలా విజయలక్ష్మి ఆమె కోడలు పోలా సుజాత సులువుగా డబ్బులు సంపాదించాలన్న నేపథ్యంలో గ్రామo లో నాటుసారతో పాటు మత్తు బిళ్ళలు యువకులకు విక్రయిస్తుంది. అందిన సమాచారం మేరకు వెదుళ్ళపల్లి ఎస్సై భాగ్యరాజ్ మాటు వేసి స్టువర్టుపురం లో ఉన్న విజయలక్ష్మిని సోమవారం అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. కోడలు సుజాతను త్వరలో అరెస్టు చేస్తామని ఎస్ఐ భాగ్యరాజ్ తెలిపారు.
![]() |
![]() |