AP: మతాంతర వివాహం చేసుకున్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. చిత్తూరుకు చెందిన సాయితేజ, యాస్మిన్ బాను బీటెక్ చదివే సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి యాస్మిన్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఇటీవల యాస్మిన్ తల్లిదండ్రులు పదే పదే కాల్ చేయడంతో సాయితేజ ఆదివారం తన భార్యను పుట్టింటికి పంపాడు. ఆ తర్వాతి రోజే యాస్మిన్ మరణించారు. పుట్టింటి వారే యాస్మిన్‌ను చంపేశారని సాయితేజ ఆరోపిస్తున్నారు.
![]() |
![]() |