ఆయుష్ వైద్య విధానాలను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మరో హోమియోపతి కాలేజీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ముత్తిరేవుల గ్రామంలో ప్రైవేటు హోమియోపతి కాలేజీ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలోని ప్రైవేటు రంగంలో 4 హోమియోపతి కాలేజీలు ఉండగా.. కొత్త కాలేజీ ఏర్పాటుతో వాటి సంఖ్య ఐదుకు చేరుతుంది. ఈ కాలేజీల్లో బిహెచ్‌ఎంఎస్ కోర్సులకు సంబంధించి 100 సీట్లు అందుబాటులోకి వస్తాయి.
![]() |
![]() |