అమరావతిపై లాంగ్ విజన్‌తో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని మంత్రి నారాయణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. రైతుల భూముల విలువ పెరగాలంటే పరిశ్రమలు రావాలన్నారు. పరిశ్రమలు రావాలంటే అదనపు భూమి అవసరం ఉంటుందని చెప్పారు. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం ఉటుందన్నారు. ఇప్పటికే భూములు ఇచ్చిన వాటి విలువ పెరగడం కోసం మరికొంత భూమి అవసరమని చెప్పుకొచ్చారు. భూసేకరణ అయితే రైతులు నష్టపోతారని.. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఒక ఏడాది లోపే ఉద్యోగుల భవనాలు, ట్రంక్ రోడ్లు పూర్తి అవుతాయని స్పష్టం చేశారు. అమరావతిలో విమానాశ్రయం రావాలని.. దీంతో అన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం నిర్ణయంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
![]() |
![]() |