చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు, నేతలు, సెలబ్రిటీలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.దార్శనికత, కృషి, పట్టుదల, అంకితభావం ఉన్న అరుదైన నాయకుడు మీరు అంటూ చంద్రబాబును మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. ఆ భగవంతుడు చంద్రబాబుకు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
![]() |
![]() |