ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురుస్తోంది

national |  Suryaa Desk  | Published : Sun, Apr 20, 2025, 01:52 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఎనిమిదో తరగతి కుర్రాడి ఆటను చూసేందుకే తాను నిద్ర లేచానంటూ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. అరంగేట్రం అదిరిపోయిందంటూ వైభవ్ ను మెచ్చుకున్నారు.ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వైభవ్, తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 34 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే, వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడినా రాజస్థాన్ రాయల్స్‌కు విజయం దక్కలేదు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు కేవలం 2 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమి పాలైంది. చివరి ఓవర్లలో లక్నో బౌలర్ అవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు, ఆఖరి ఓవర్లో 9 పరుగులను కాపాడి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఓటమితో రాజస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com