ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ సూపర్ శతకం (35 బంతుల్లో 100)తో పాత రికార్డుల దుమ్ముదులిపి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్లకే ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ బీహార్ చిచ్చరపిడుగు... జైపూర్లో సృష్టించిన పరుగుల సునామీకి 2025 సీజన్లో వరుస ఓటముల తర్వాత రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) గెలుపు బాట పట్టింది. ఇక, తన 14 ఏళ్ల కొడుకు చారిత్రాత్మక సెంచరీ సాధించిన తర్వాత వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ భావోద్వేగానికి గురయ్యారు. గత కొన్ని నెలలుగా తన కుమారుడి నైపుణ్యాలు మెరుగుపరిచి, అతడు అద్భుతంగా రాణించడానికి సహకరించిన ఆర్ఆర్ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, విక్రమ్ రాథోడ్, జుబిన్ భరుచా, సాయిరాజ్ బహుతులే, రూబీలతో సహా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం, కోచింగ్ సిబ్బందికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
![]() |
![]() |