అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం ప్రకటించారు. ఫార్మాస్యూటికల్ మందుల ధరలను దేశంలో 30 నుంచి 80 శాతం వరకు తగ్గించనున్నట్లు వెల్లడించారు. అమెరికాలో ధరల తగ్గింపుతో ఏర్పడే నష్టాన్ని ఇతర దేశాల్లో ధరలు పెంచడం ద్వారా భర్తీ చేయనున్నట్లు ఆయన తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పోస్ట్ చేశారు.
ట్రంప్ మాట్లాడుతూ, "ఫార్మా కంపెనీలు ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో 10 రెట్లు అధిక ధరకు మందులు విక్రయిస్తున్నాయి. ఈ అన్యాయాన్ని సరిదిద్దేందుకు మంగళవారం నుంచి చర్యలు చేపడతాం" అని స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం అమెరికా ప్రజలకు మందుల ధరల భారం తగ్గించడంతో పాటు, ఫార్మా రంగంలో విధానపరమైన మార్పులకు దారితీసే అవకాశం ఉంది.
![]() |
![]() |