భారత్-ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి. మే 12 నుంచి బ్రసెల్స్‌లో 11వ రౌండ్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వ్యాపార, ఆర్థిక సంబంధాలు మరింత బలపడే అవకాశముంది. దిగుమతులు, ఎగుమతులపై సుంకాలు తగ్గి వాణిజ్యం వేగంగా పెరగనుంది. ఇదివరకే భారత్, యూకే మధ్య ఒప్పందం మే 6న ఖరారైంది. ఫలితంగా స్కాచ్ విస్కీ, కార్ల ధరలు తగ్గే అవకాశం ఉంది.
![]() |
![]() |