అరేబియా మహాసముద్రంలోని బహామాస్ ద్వీపంలో భారత సంతతికి చెందిన ఒక విద్యార్థి విషాద పరిణామంలో ప్రాణాలు కోల్పోయాడు. మసాచుసెట్స్‌లో విద్యనభ్యసిస్తున్న గౌరవ్ జైసింగ్ అనే యువ విద్యార్థి విహారయాత్ర నిమిత్తం బహామాస్ కు వెళ్లాడు. కాగా, అతను నివసిస్తున్న హోటల్‌లో బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు జారిపడిపోయాడు.
దీంతో హోటల్ సిబ్బంది వెంటనే స్పందించి గౌరవ్‌ను ఆస్పత్రికి తరలించినా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ సంఘటన కుటుంబసభ్యులు, స్నేహితుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గౌరవ్ జైసింగ్ ఈ వారం చివరలో తన గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేయనున్నట్లు సమాచారం. స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
![]() |
![]() |