హర్యానాలోని రోహతక్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. భార్య అద్దెకు ఉంటున్న వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భర్త ఆమెను సజీవంగా పాతిపెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
స్థానికులు మరియు పోలీసుల వివరాల ప్రకారం, హరిదీప్ అనే వ్యక్తి తన భార్య తన ఇంట్లో అద్దెకు ఉంటున్న జగ్‌దీప్‌తో ఎఫైర్ పెట్టుకుందని తెలిసి తీవ్రమైన ఆవేశానికి లోనయ్యాడు. దీని నేపథ్యంలో తన స్నేహితులతో కలిసి పథకం వేసిన హరిదీప్, ఓ పొలంలో 7 అడుగుల లోతైన గొయ్యి తీసి భార్యను అందులో సజీవంగా పాతిపెట్టాడు.
ఈ ఘటన గురించి మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ దర్యాప్తులో అందిన ఆధారాల ఆధారంగా హరిదీప్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు నిజాలు బయటపడ్డాయి. విచారణలో హరిదీప్ నేరం ఒప్పుకున్నాడు. అంతేకాక, భార్యతో ఎఫైర్ పెట్టుకున్న జగ్‌దీప్‌ను మూడు నెలల క్రితమే హత్య చేసి పాతిపెట్టినట్లు కూడా అంగీకరించాడు.
ప్రస్తుతం పోలీసులు సంఘటనాస్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీయడం కోసం తవ్వకాలు ప్రారంభించారు. ఈ అమానవీయ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసులు మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
![]() |
![]() |