తిరుపతి జిల్లా ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో "మిషన్ శక్తి వన్ స్టాప్ సెంటర్"ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సోమవారం ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా మహిళలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, మానసిక, లైంగిక వేధింపులకు, యాసిడ్ దాడులు, అక్రమ రవాణా, బాల్య వివాహాలు, సైబర్ నేరాలకు గురైన బాధితులకు ఉచితంగా సేవలు ఒకేచోట అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
![]() |
![]() |