రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, సేవల అమలుపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రేషన్, దీపం-2, ఆర్టీసీ, పంచాయతీ సేవలపై అభిప్రాయాలను పరిశీలించారు.పథకాలు, పౌరసేవలపై జూన్ 12 తర్వాత ఆకస్మిక తనిఖీ ఉంటుందన్నారు. ప్రభుత్వం అందించే సేవల్లో ప్రజలకు పూర్తిస్థాయి సంతృప్తి ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఆర్టీసీలో సౌకర్యాలు, సదుపాయాలు ఇంకా మెరుగుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. దీపం లబ్ధిదారులకు ఒకేసారి 3 సిలిండర్ల సొమ్ము ఇచ్చే అంశంపై పరిశీలించాలన్నారు. డేటా అనలటిక్స్‌కు అన్ని శాఖల్లో అత్యంత ప్రాధాన్యమివ్వాలని అధికారులకు సీఎం మార్గనిర్దేశం చేశారు.
![]() |
![]() |