అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జీనబాడు రెవెన్యూ పరిధిలోని శంకరం అటవీ ప్రాంతంలో అటవీ శాఖాధికారులు ఆదివారం 30 కింగ్‌కోబ్రా పిల్లలను విడిచిపెట్టారు. ఆ ప్రాంతంలో నెల రోజుల కిందట 30 కింగ్‌కోబ్రా గుడ్లను అటవీ శాఖాధికారులు, వైల్డ్ లైఫ్ సొసైటీ కో ఆర్డినేటర్ మూర్తి గుర్తించారు. ఆ గుడ్లకు రక్షణగా నెట్ ఏర్పాటు చేశారు. నెల రోజుల తర్వాత ఆ 30 గుడ్ల నుంచి పిల్లలు బయటకు రావడంతో.. వాటిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అంతరించిపోతున్న జాతుల్లో కింగ్ కోబ్రా ఒకటని, వాటి రక్షణకు కృషిచేస్తున్నామని అటవీ శాఖ అధికారులు శాంతిప్రియ, దివాన్ మొహిద్దీన్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa