కాకినాడ జిల్లా సామర్లకోటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సామర్లకోటలోని సీతారామ కాలనీలో ఈ ఘటన జరిగింది. తల్లి, ఆమె ఇద్దరు కూతుళ్లూ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ముగ్గురినీ గుర్తు తెలియని వ్యక్తులు తలలు పగులగొట్టి హతమార్చారు. ములపత్తి ప్రసాద్, మాధురి దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. పేర్లు కుమారి, జెస్సీ. ప్రసాద్ స్థానికంగా ఉండే ఓ ఫ్యాక్టరీలో బొలెరో వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి నైట్ డ్యూటీకి వెళ్లిన ప్రసాద్.. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూస్తే భార్య, ఇద్దరు కుమార్తెలు రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఈ విషయంపై ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. అక్కడి పరిసరాలను పరిశీలించారు. అనంతరం ప్రసాద్‌ను విచారిస్తున్నారు. అయితే ప్రశాంతంగా ఉండే కాలనీలో ఒకేసారి ముగ్గురు హత్యకు గురికావడం సంచలనం రేపుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa