భారత్ అంటే గిట్టని పాకిస్తాన్ తరచూ కవ్వింపులకు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, చర్యలకు దిగుతూనే ఉంటుంది. ఇక ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత్ దాడుల తాకిడికి తట్టుకోలేని పాకిస్తాన్.. కాళ్లబేరానికి వచ్చి దాడులు ఆపాలని కోరింది. కానీ భారత్‌పై మాటల దాడులు మాత్రం ఆపడం లేదు. అయితే పాక్ చేస్తున్న కవ్వింపు వ్యాఖ్యలకు ఎప్పటికప్పుడు భారత్ గట్టిగా బదులిస్తూనే ఉంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ , మాజీ మంత్రి బిలావల్ భుట్టో భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అమెరికాలో పర్యటించిన పాక్ ఆర్మీ చీఫ్.. భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. అదే సమయంలో భారత బిజినెస్‌మెన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు అసిమ్ మునీర్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇటీవల అమెరికా టూర్‌లో భాగంగా ఫ్లోరిడాలోని టంపాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన అసిమ్ మునీర్.. భవిష్యత్తులో భారత్‌తో యుద్ధం జరిగితే ముఖేష్ అంబానీకి చెందిన జామ్‌నగర్ రిఫైనరీని లక్ష్యంగా చేసుకుంటామని తీవ్ర బెదిరింపులకు పాల్పడినట్లు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇండియన్ ఎకానమీకి రిలయన్స్ సంస్థ కీలకమని.. విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అమెరికా చేస్తున్న వాణిజ్య డిమాండ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లొంగకుండా.. రష్యా నుంచి రిలయన్స్ సంస్థ చమురు దిగుమతులు కొనసాగిస్తున్న నేపథ్యంలో అసిమ్ మునీర్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఆయనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మాత్రమే కాదని.. భారత ఆర్థిక సార్వభౌమత్వంపై దాడి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక చైనాపై ట్రంప్ విధించిన సుంకాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో.. అమెరికా ఇప్పుడు భారత్‌ను లక్ష్యంగా చేసుకుంది. చైనా వద్ద ట్రంప్ పన్నాగాలు సాగకపోవడంతో.. ఇప్పుడు భారత్‌పై ఒత్తిడి పెంచడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తూ ఇటీవల బెదిరింపులకు దిగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్‌కు తమ విధేయతను చూపించుకునేందుకు అంబానీపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు అర్థం అవుతోంది.
అదే సమయంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని పాకిస్తాన్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం కూడా ఈ వ్యూహంలో భాగమేనని మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో భారత్‌ను ఇబ్బంది పెట్టి.. బలూచిస్తాన్‌లోని వనరులను ట్రంప్‌కు ఇస్తామని హామీ ఇవ్వడం ద్వారా అమెరికాతో తమ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో తమ దేశ రాజకీయ ప్రయోజనాల కోసం.. భారత్‌ను ఉపయోగించుకునేందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేస్తున్న ప్రయత్నమని అర్థం అవుతోంది. అయితే.. భారత నాయకత్వం, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నందున పాక్ ఎత్తుగడలు సాగవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa